Friday, March 11, 2016

నిశ్చయ తాంబూలాదులకు సుముహూర్త నిర్ణయము.

నిశ్చయ తాంబూలమునకు : ఉభయ పక్షములందును విదియ,తదియపంచమి,సప్తమి,దసమి,తిధులు; శుక్లపక్షమందు

ఏకాదశి, పునర్వసు, పౌర్ణమి, తిధులు, ఆది, బుధ, గురు, శనివారములందును, అశ్విని, పునర్వసు, పుష్యమి, హస్త,

చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, శతభిషం నక్షత్రములందు,లగ్నమునకు 5-9 స్థానములందు పాపగ్రహములు

లేనపుడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొనవలెను. పెండ్లికుమారుని,పెండ్లికుమార్తెచేయుటకు:

అశ్విని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,హస్త,చిత్త,అనూరాధ,మూల,ఉత్తరాషాఢ,శ్రవణం,ధనిష్ట,శతభిష,ఉత్తరా

భాద్ర,రేవతి, నక్షత్రములు ఆది,బుధ,గురు,శని,వారములు,మంచి తిధులయందు చేయవలెను.

సోమ,శుక్రవారములయందు పెండ్లికుమారుని,పెండ్లికూతురుని చేయుట మధ్యమపక్షము,మంగళవారము పగలు

వివాహ విషయమునందు నిషేధము.

కొత్త పెళ్ళీకూతురు పెండ్లి ఐన మొదటి సం!!లో చైత్రమాసములో పుట్టింట నున్నతండ్రికి దోషము, ష్ఠమాసములో

అత్తింటయున్న బావగార్కి,ఆషాఢమాసములో అత్తగార్కి,పుష్యమాసములో మామగార్కి, ధికమాసములో

భర్తగార్కి,క్షయమాసములో తనకు కీడుకలుగును పెండ్లిపీట: 6 అంగుళముల ఎత్తు,5 అంగుళముల వెడల్పు, 37

అంగుళముల పొడవు సైజులు నుండవలెను. వివాహమునకు శుభకాలము: ఉభయపక్షములయందు

విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి;శుక్లపక్షమందు త్రయోదశి,పౌర్ణమి;కృష్ణపక్ష పాడ్యమి తిధులు,బుధ-గురు-

శుక్రవారములు మంచివి.రోహిణి,మృగశిర,మఘ,ఉత్తరాత్రయం,హస్త్ర,స్వాతి అనూరాధ,మూల,రేవతి

నక్షత్రములు.వృషభ,మిధున,కర్కాటక,కన్య,తుల,ధనుర్,మీన లగ్నములును మంచివి. సప్తమము(7) గ్రహ వర్జితమై

యుండవలెను,అష్టమశుద్ధి ప్రధానము.చంద్రుడు 6,8,12 లలోను,ఏ గ్రహముతోను కలిసియుండకూడదు.రవి

మీనములలో నుండగా వచ్చిన చైత్రమాసమునందు చేయరాదు. కూతురునకు కొడుకునకు ఒకే లగ్నమందు పెండ్లి

చేయకూడదు.ముందుగా కుమార్తె వివాహము,తర్వాత కుమారుని వివాహము చేయవలెను.ఏకోదరులకు ఆరునెలల

లోపు వివాహము చేయరాదు.కాని ఫాల్గునమాసమునందు ఒకరికి,చైత్రమాసమునందు రెండవవారికి చేయవచ్చును.

పునర్వివాహము: భార్య గతించిన వారు,పునర్వివాహము చేసికొనదలచిన యెడల,గతించిన భార్య యొక్క సంతానము

జీవించియున్నచో బేసి సంవత్సరము,బేసి మాసములందును;సంతానము లేనిచో సరి సంవత్సరమి,సరి

మాసములందును వివాహము చేసికొనవలెను. నవ వధూ గృహ ప్రవేశము: వివాహము అయిన 16 రోజుల లోపల తిధి,

వార, నక్షత్రములను చూడక సరిదినములలో గృహప్రవేశం చేయవచ్చును. 16 రోజుల అనంతరమైనచో ద్వాదశ శుద్ధి,

విషము, వర్ష-మాసము చుడవలెను 2,3,5,7,10 తిధులు; బుధ, గురు, శుక్రవారములు; అశ్వి, రోహి, మృగ, పున, పుష్య,

ఉత్తరాత్రయం, హస్త, చిత్త, సాతి, అనూ, జ్యేష్ట, స్రవ, ధని, శతభిష. నక్షత్రములు; రవి కేంద్రములలోలేకునండునపుడు

రాత్రికాలమున ప్రవేశింపవలెను. గాజులు: గర్బము దరించిన బేసినెలలు 5 లేదా 7నెలలయందు తొడిగింపవలేను.

గర్భవతియైన స్త్రీని పురిటికి తెచ్చుటకు: బేసి నెలలైన 7 లేదా 9వ మాసమున మంచిరోజున తీసుకురావలెను,మొదటి

రెండు పురుళ్ళు పుట్టింట, మూడవ పురుడు అత్తింట పోయవలెను. 3 వ పురుడు పుట్టింట పోసిన శిశువునలు హాని.

బాలింతరాలికి పత్యమునకు: బుధ,గురు,శుక్రవారములు;2,3,5,7,910,11,13,15 తిధులు;

రోహిణి,మృగ,పున,పుష్య,అనూ,శ్రవ,ధని,శత,రేవతి,ఉత్తరాత్రయము మంచివి,లగ్నాత్ పదవయింట పాపగ్రహము గాని

వీక్షణ గాని లేకుండ చూడవలెను. బాలింత స్నానము: పురుడైన 11 వ రోజు చేయింపవలెను,కుదరనిచో

ఆది,మంగళ,గురువారములు; అశ్విని ,రోహిణి, మృగశిర ,ఉత్తరాత్రయం ,హస్త,స్వాతి, అనూరాధ,రేవతి నక్షత్రములందు

చేయింపవలెను. శిశువునకు మొలత్రాడు కట్టుటకు: పురిటి శుద్ది నాడు కట్టుట మంచిది.కుదరనిచో అశ్విని,రోహి,మృగ,

ఉత్తరాత్రయము,పుష్య,హస్త,అనూ,మూల,రేవతి తారలతో కూడిన మంగళవారము ,శుభ తిధియందు,5వ నెలలో

మొలత్రాడు కట్టుట మంచిది.పసుపు,తెలుపు లేదా వెండి,మంగారు త్రాడునకు రాగికాణి,నల్లపూసలు,పురిటి వేళ తీసిన

శిశువు బొడ్డు గాని కట్టినచో గాలి,ధూళి,దిష్టి దోషములు తగలక యుండును. శిశువును ఇల్లు కదుపుటకు:

సోమ,బుధ,గురు,శుక్రవారములు; 2,3,5,7,10,11,13 తిధులు; అశ్వి,రోగ, మృగ,పున,పుష్య,ఉత్తరాత్ర్యం, హస్త,చిత్త,

అనూ,శ్రవ,ధని,శాత దెవతి నక్షత్రములు; మేష,వృష, కర్కట,తుల,ధను,మీన లగ్నములు మంచివి. శిశువుపుట్టిన 3వ

మాసములో మొదట దేవలయ దర్శనమును చేసి, అటుపైన మేనమామ యింటీకి తీసుకువెళ్ళవలెను. సూర్యచంద్రుల

దర్శనము : శిశువు జన్మించిన 3వ మాసములొ మంచి రోజున దర్శననము చేఇంపవలెను. శిశువును భూమి పై

కూర్చుండబెట్టుటకు: జననాది 5 వ మాసమునందు కుంచెడు ధన్యము రాశిగా పోసి,నూతన వస్త్రము

పరచి,అశ్వి,మృగ,పుష్య,జ్యేష్ఠ నక్ష్త్రములందు కూర్చుండబెట్టి,పెద్దలచే ఆశీర్వచనము చేయించవలెను. పురడు తర్వాత

శిశువుతో అత్తవారింటికి వెళ్ళుట: సోమ,బుధ,గురు,శనివారములు;2,3,5,7,10,13

తిధులు;అశ్విని,రోహిణి,మృగ,పున,పుష్య,మఘ,ఉత్తరాత్రయం,హస్త,చిత్త,స్వాతి,అనూ,శ్రవ,ధని,శత,రేవతీ నక్షత్రములు

మంచివి.తారాబల,ఆనందాదియోగ,వారశూలాలు చూడవలెను.తారాబలము శిశువునకు,తల్లికి కూడా

సరిపోవలెను.శిశువు జననాది 3,5,7,911 నెలలందు గాని,నెలలోపున బేసిరోజులయందు గాని వెళ్ళవచ్చును.

దత్తస్వీకారమునకు: బుధ,గురు,శుక్రవారములు;2,3,5,7,10,13 శుద్ధ ఏకాదశి ,రోహి, పున, పుష్య, ఉత్తరాత్రయం, హస్త,

స్వాతి, అనూ, శ్రవ, ధని, శత, రేవతి, నక్షత్రములు మంచివి.లగ్నమునకు శుభగ్రహదృష్టి,శుభగ్రహస్థితి మంచిది.

యజ్ఝోపవీత ధారణ: శ్రావణ పౌర్ణమి.గ్రహణ మోక్షము,మృత జాతశౌచానంతరములందు క్రొత్త జంధ్యము ధరించవలెను.

No comments:

Post a Comment