Friday, March 11, 2016

బల్లిపాటునకు ఫలము

శిరస్సు మీద బల్లి పడిన కలహము,బ్రహ్మరంధ్రమునకు వెనుకబడిన లక్ష్మీ సంప్రాప్తి.నడినెత్తి రోగము, ముఖమున బంధు

దర్శనము, మంగురుల మీద హాని, జడ మీద భర్తకు, చెంపల పైన స్త్రీలకు శుభము.చెవి మీద దుర్వార్తశ్రవణము,కుది

కన్ను మీద అపజయము,ఎడమకన్ను అవమానము, ఉక్కు మీద కార్యహాని, మీసములపై అధికార లాభము, గడ్డముపై

అపమృత్యువు, గొంతు ఎముక మీద అనేక కష్టములు, రొమ్మున జయము, గుండె మీద అధైర్యము, పై కడుపున

పుత్రలాభము, భుజములపై అన్యసహాయము, బొడ్డున భయము, అరచేతిపై ధనప్రాప్తి, మోచేతి మీద కలహము,

మణికట్టుపై గర్వభంగము, వెన్నున శత్రుభయము, నడుమున వస్త్రలాభము, తొడ మీద అన్నరోగ్యము, లింగముపైన

సంతాన ఫ్రాప్తి, మోకాలిపైన వాహన లాభము, పిక్కలయందు కార్యఫలము, పాదమున స్త్రీలాభము, కాలివ్రేళ్ళ మీద

రోగము, అరికాలిమీద ఉద్యోగప్రాప్తి కలుగును.

No comments:

Post a Comment