Friday, March 11, 2016

శివ సందర్శన విధి

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు

దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు

దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే

శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే

తీర్చేది.

పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న

ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా

అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత

శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని

తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం. అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి

ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ

తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు. మనకు ప్రతీ శివాలయాల్లోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శివాగమనంలో

చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ

5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాల్ని మనం

పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ

తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు.

శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం

అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త

ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా

గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గరనుండి, సంపద దగ్గరనుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్యలేనేలేదు. చదువుకు,

సంపదకు, మోక్షానికి అధిష్ఠానం అయి ఉంటాడు. ప్రతిరోజూ ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళామలకము. వారి

అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన

స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖాన్ని "వామదేవ'' ముఖం అని అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న, 4 దిక్కులా గురించి తెలుసుకోగలిగాం. ఇక చివరి

ముఖం శివలింగంపైన (అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం)ఉండే ముఖం. ఆ ముఖాన్ని "ఈశాన ముఖం'' అంటారు. మనం లిగంపైన చూసి, ఓం

ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే

విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ

ఉంటుంది. ఉత్తరం వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే

ముఖం.

వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్తమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే విష్ణువు, శివుడు ఒకరే ...

రెండు లేనే లేవు .... శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒకటి గమనించండి. శివపురాణంని రాసినది వేదవ్యాసుడు.

వ్యాసుడే విష్ణువు ... విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న

పరమాత్మ ఒక్కడే ... రెండు కాదు. చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు. కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే

పలుకుతాను. ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.

అంతేకాక ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నాహం అని అంటే మనకు మూడు ఫలితాలని కూడా ఇస్తుంది. అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉందొ

అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకు మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు,

ఎటువంటి కారణము చేతనూ మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. రెండు ... మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే ఇస్తారు. ఉదాహరణకు ...

ఉన్న కోటిని ధర్మబద్ధంగా రెండు కోట్లు చేస్తారు. (ఇది ఉదాహరణ మాత్రమే మీకు ఈజీగా అర్థమవ్వాలని) మూడు ... మనకు ఉన్నదానిని అనుభవించే

ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు ... ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్థితిలో (షుగర్ ఉందనుకోండి) ఉంటే, అప్పుడు ఉన్న

దాన్ని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండా కాపాడతాడు.

తురువాత ఈశాన ముఖము. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఆ ఈశాన

ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది. శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది.

అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

శివాలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది. పురుషులు కేవలం పంచె మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్వ్యంని నడుముకు

కట్టుకొని మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారిపట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముందుగా చెప్పినట్లు పదఘట్టన

వినకూడదు జాగ్రత్త. మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితులలోనూ విభూధిని కాని, బిల్వపత్రాలని కాని, కుంకుమను కాని, ప్రసాదాన్ని కాని ఎట్టి

పరిస్థితులలో నందీశ్వరుడి మీద పెట్టకూడదు. సాధారణంగా చాలామంది నందిమీద విభూధిని, బిల్వఆకులను వేస్తూ ఉంటారు. అది మహాపాపంగా

పరిగణించబడింది.
రుద్రాక్ష - ధారణ - మహిమ

శ్రీ శివ మహాపురాణము

ఒకానొక కల్పకాలంలో రుద్రుడు అగణిత దివ్య వత్సరాలపాటు ధ్యానతత్పరుడై ఉండిపోయాడు.

ఆయన తపస్సు చాలించి కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు - మలయ

; సహ్యాద్రి పర్వతాలయందు పడి - కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి.

రుద్రుడి అక్ష భాగము (కన్ను) నుండి రాలిపడినందువల్ల ; రుద్ర (దుఃఖములను) క్షయము (నాశనము చేయు గుణము) కలిగినందువల్ల వీటికి

రుద్రాక్షలనే పేరు సార్ధకమైంది.

నాలుగు వర్ణాల భక్తులకూ ధారణయోగ్యమైనవి ఈ రుద్రాక్షలు. జపం చేసుకోవడానికీ - ధారణకు కూడా చిన్న రుద్రాక్షలే అత్యంత ఫలవంతమైనవి.

గురివింద గింజ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలే శ్రేష్ఠమైనవి. రేగుపండు - ఉసిరికాయ ప్రమాణాల్లోనూ రుద్రాక్షలు లభిస్తాయి.

రుద్రాక్షలన్నీ ధరించదగ్గవికావు. కొన్నిటి విషయంలో అశుభదాయకమైనవీ ఉన్నాయి. పగిలినవీ - పురుగులు ప్రవేశించినవీ - గుండ్రంగా లేనివీ -

కండలేనివీ పనికిరావు. వీటితో జపమైనా నిషిద్ధమే!

నునుపుగా, కంటకయుతంగా, గట్టిగా ఉండే రుద్రాక్షలు ఎంపిక చేసుకోవాలి.

మాల ఏర్పడాలంటే సూత్ర ద్వారం ఉండాలి. కనుక, అదీ సహజంగా ఏర్పడిన రుద్రాక్ష శ్రేష్ఠం!

పదకొండు వందల రుద్రాక్షలను ధరించినచో అతడు సాక్షాత్‌ శివస్వరూపుడు, బ్రాహ్మణులు తెల్లనివీ - క్షత్రియులు ఎర్రనివి, వైశ్యులు పసుపు రంగువీ,

అన్నీ కలిసిన వర్ణాలు ఇతర వర్ణాలవారూ ధరించవచ్చు!

ఆరోగ్యానికి రుద్రాక్షలు :

రుద్రాక్షధారణ ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది. వ్యాధులు - బాధలు ఉండవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.

మామిడిచెట్టును పోలినట్టుండే వృక్షం రుద్రాక్ష ఫలాలను ఇస్తుంది. శరదృతువులో ఫలిస్తుంది. ఫలం యొక్క పై పొర దళసరిగా ఉంటుంది. పండు రూపంలో

దీన్ని సేకరించగలిగితే మంచిదే! దానంతట అదే ఎండి, గట్టి పడుతుంది. పండు పుల్లగా ఉంటుంది. వాత - కఫ దోషాలను నివారిస్తుంది.

రుద్రాక్షధారణ క్షయరోగ నివారిణి. నీటిలో రుద్రాక్షను అరగదీసి మశూచి రోగాన్ని నివారించడం ఆయుర్వేదంలో మనకి తెలిసినదే! అలాగే తేనెలో అరగదీసి

మూర్చరోగాన్ని పోగొట్టవచ్చు!

వీటికి ఉండే చారలను బట్టి ముఖాలను నిర్ణయిస్తారు.

రుద్రాక్షలలో రకాలు :

ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి...ఇలా మొత్తం 14 వరకూ ఉన్నాయి. ఇవిగాక కొన్ని ప్రత్యేకమైనవీ ఉన్నప్పటికీ - అవి అరుదుగా లభిస్తాయి.

వారి పూర్వ పుణ్యానుసారం లభిస్తే లభించ వచ్చునేమో గానీ, సాధారణంగా అలభ్యం అనే చెప్పాలి.

ఏకముఖి రుద్రాక్ష: : దర్శనం మహాపాతక నాశనం ; అర్చనం లక్ష్మీకటాక్ష కారణం.

ద్విముఖి : : గోహత్యాపాతక నివారిణి, సర్వాభీష్ట కారిణి.

త్రిముఖి : : కార్యసిద్ధి ; విధ్యాభివృద్ధి.

చతుర్ముఖి : : బ్రహ్మస్వరూపం, దర్శన - స్పర్శ మాత్రాన స్పర్శ పాపహారిణి, నరహత్యాదోష నివారిణి.

పంచముఖి: కాలాగ్ని రుద్ర స్వరూపం. మోక్షకారకం.

షణ్ముఖి : కుమారస్వామి స్వరూపం. సమస్తపాపహారిణి.

సప్తముఖి : మన్మధరూపిణి. వశీకరనణి.

అష్టముఖి : దారిద్ర్య విధ్వంసిని ; భైరవ స్వరూపం ; దీర్ఘాయుష్య కారకం.

నవముఖి : నవదుర్గా స్వరూపం. శివతుల్య వైభవదాయిని.

దశముఖి : విష్ణురూపిణి. సకలాభీష్టప్రదాయిని.

ఏకాదశముఖి : రుద్రరూపిణి. విశేష ఫలదాయిని.

12, 13, 14 ముఖాలు : ఏవైనా ఒక ప్రత్యేకమైన ఇచ్చను హృదయ మందుంచుకొని, ఆరాధన చేయదగ్గవి. మండలం (40) రోజుల్లో ఫలితాన్నివ్వగలవు.

ధారణకు మంత్రబీజాలు :

ఏకముఖ, చతుర్ముఖ, పంచముఖ, దశముఖ, త్రయోదశ ముఖాలకు : "ఓం హ్రీం నమః" అనే మంత్రంతో ధరించాలి.

ద్విముఖ, చతుర్ముఖి, చతుర్దశ ముఖాలకు : "ఓం హ్రీం నమః"

త్రిముఖ రుద్రాక్షకు : "ఓం క్లీం నమః" అని 108 సార్లు జపించాలి.

6, 9, 11 ముఖాలు గల రుద్రాక్షలకు : "ఓం హ్రీం నమః"

సప్త, అష్టముఖి రుద్రాలకు : "ఓం హుం నమః"

ద్వాదశ ముఖికి : "ఓం క్రౌం నమః"

మంత్ర హీనంగా రుద్రాక్ష ధారణ ఫలితాన్నివ్వదు.
నిశ్చయ తాంబూలాదులకు సుముహూర్త నిర్ణయము.

నిశ్చయ తాంబూలమునకు : ఉభయ పక్షములందును విదియ,తదియపంచమి,సప్తమి,దసమి,తిధులు; శుక్లపక్షమందు

ఏకాదశి, పునర్వసు, పౌర్ణమి, తిధులు, ఆది, బుధ, గురు, శనివారములందును, అశ్విని, పునర్వసు, పుష్యమి, హస్త,

చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, శతభిషం నక్షత్రములందు,లగ్నమునకు 5-9 స్థానములందు పాపగ్రహములు

లేనపుడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొనవలెను. పెండ్లికుమారుని,పెండ్లికుమార్తెచేయుటకు:

అశ్విని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,హస్త,చిత్త,అనూరాధ,మూల,ఉత్తరాషాఢ,శ్రవణం,ధనిష్ట,శతభిష,ఉత్తరా

భాద్ర,రేవతి, నక్షత్రములు ఆది,బుధ,గురు,శని,వారములు,మంచి తిధులయందు చేయవలెను.

సోమ,శుక్రవారములయందు పెండ్లికుమారుని,పెండ్లికూతురుని చేయుట మధ్యమపక్షము,మంగళవారము పగలు

వివాహ విషయమునందు నిషేధము.

కొత్త పెళ్ళీకూతురు పెండ్లి ఐన మొదటి సం!!లో చైత్రమాసములో పుట్టింట నున్నతండ్రికి దోషము, ష్ఠమాసములో

అత్తింటయున్న బావగార్కి,ఆషాఢమాసములో అత్తగార్కి,పుష్యమాసములో మామగార్కి, ధికమాసములో

భర్తగార్కి,క్షయమాసములో తనకు కీడుకలుగును పెండ్లిపీట: 6 అంగుళముల ఎత్తు,5 అంగుళముల వెడల్పు, 37

అంగుళముల పొడవు సైజులు నుండవలెను. వివాహమునకు శుభకాలము: ఉభయపక్షములయందు

విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి;శుక్లపక్షమందు త్రయోదశి,పౌర్ణమి;కృష్ణపక్ష పాడ్యమి తిధులు,బుధ-గురు-

శుక్రవారములు మంచివి.రోహిణి,మృగశిర,మఘ,ఉత్తరాత్రయం,హస్త్ర,స్వాతి అనూరాధ,మూల,రేవతి

నక్షత్రములు.వృషభ,మిధున,కర్కాటక,కన్య,తుల,ధనుర్,మీన లగ్నములును మంచివి. సప్తమము(7) గ్రహ వర్జితమై

యుండవలెను,అష్టమశుద్ధి ప్రధానము.చంద్రుడు 6,8,12 లలోను,ఏ గ్రహముతోను కలిసియుండకూడదు.రవి

మీనములలో నుండగా వచ్చిన చైత్రమాసమునందు చేయరాదు. కూతురునకు కొడుకునకు ఒకే లగ్నమందు పెండ్లి

చేయకూడదు.ముందుగా కుమార్తె వివాహము,తర్వాత కుమారుని వివాహము చేయవలెను.ఏకోదరులకు ఆరునెలల

లోపు వివాహము చేయరాదు.కాని ఫాల్గునమాసమునందు ఒకరికి,చైత్రమాసమునందు రెండవవారికి చేయవచ్చును.

పునర్వివాహము: భార్య గతించిన వారు,పునర్వివాహము చేసికొనదలచిన యెడల,గతించిన భార్య యొక్క సంతానము

జీవించియున్నచో బేసి సంవత్సరము,బేసి మాసములందును;సంతానము లేనిచో సరి సంవత్సరమి,సరి

మాసములందును వివాహము చేసికొనవలెను. నవ వధూ గృహ ప్రవేశము: వివాహము అయిన 16 రోజుల లోపల తిధి,

వార, నక్షత్రములను చూడక సరిదినములలో గృహప్రవేశం చేయవచ్చును. 16 రోజుల అనంతరమైనచో ద్వాదశ శుద్ధి,

విషము, వర్ష-మాసము చుడవలెను 2,3,5,7,10 తిధులు; బుధ, గురు, శుక్రవారములు; అశ్వి, రోహి, మృగ, పున, పుష్య,

ఉత్తరాత్రయం, హస్త, చిత్త, సాతి, అనూ, జ్యేష్ట, స్రవ, ధని, శతభిష. నక్షత్రములు; రవి కేంద్రములలోలేకునండునపుడు

రాత్రికాలమున ప్రవేశింపవలెను. గాజులు: గర్బము దరించిన బేసినెలలు 5 లేదా 7నెలలయందు తొడిగింపవలేను.

గర్భవతియైన స్త్రీని పురిటికి తెచ్చుటకు: బేసి నెలలైన 7 లేదా 9వ మాసమున మంచిరోజున తీసుకురావలెను,మొదటి

రెండు పురుళ్ళు పుట్టింట, మూడవ పురుడు అత్తింట పోయవలెను. 3 వ పురుడు పుట్టింట పోసిన శిశువునలు హాని.

బాలింతరాలికి పత్యమునకు: బుధ,గురు,శుక్రవారములు;2,3,5,7,910,11,13,15 తిధులు;

రోహిణి,మృగ,పున,పుష్య,అనూ,శ్రవ,ధని,శత,రేవతి,ఉత్తరాత్రయము మంచివి,లగ్నాత్ పదవయింట పాపగ్రహము గాని

వీక్షణ గాని లేకుండ చూడవలెను. బాలింత స్నానము: పురుడైన 11 వ రోజు చేయింపవలెను,కుదరనిచో

ఆది,మంగళ,గురువారములు; అశ్విని ,రోహిణి, మృగశిర ,ఉత్తరాత్రయం ,హస్త,స్వాతి, అనూరాధ,రేవతి నక్షత్రములందు

చేయింపవలెను. శిశువునకు మొలత్రాడు కట్టుటకు: పురిటి శుద్ది నాడు కట్టుట మంచిది.కుదరనిచో అశ్విని,రోహి,మృగ,

ఉత్తరాత్రయము,పుష్య,హస్త,అనూ,మూల,రేవతి తారలతో కూడిన మంగళవారము ,శుభ తిధియందు,5వ నెలలో

మొలత్రాడు కట్టుట మంచిది.పసుపు,తెలుపు లేదా వెండి,మంగారు త్రాడునకు రాగికాణి,నల్లపూసలు,పురిటి వేళ తీసిన

శిశువు బొడ్డు గాని కట్టినచో గాలి,ధూళి,దిష్టి దోషములు తగలక యుండును. శిశువును ఇల్లు కదుపుటకు:

సోమ,బుధ,గురు,శుక్రవారములు; 2,3,5,7,10,11,13 తిధులు; అశ్వి,రోగ, మృగ,పున,పుష్య,ఉత్తరాత్ర్యం, హస్త,చిత్త,

అనూ,శ్రవ,ధని,శాత దెవతి నక్షత్రములు; మేష,వృష, కర్కట,తుల,ధను,మీన లగ్నములు మంచివి. శిశువుపుట్టిన 3వ

మాసములో మొదట దేవలయ దర్శనమును చేసి, అటుపైన మేనమామ యింటీకి తీసుకువెళ్ళవలెను. సూర్యచంద్రుల

దర్శనము : శిశువు జన్మించిన 3వ మాసములొ మంచి రోజున దర్శననము చేఇంపవలెను. శిశువును భూమి పై

కూర్చుండబెట్టుటకు: జననాది 5 వ మాసమునందు కుంచెడు ధన్యము రాశిగా పోసి,నూతన వస్త్రము

పరచి,అశ్వి,మృగ,పుష్య,జ్యేష్ఠ నక్ష్త్రములందు కూర్చుండబెట్టి,పెద్దలచే ఆశీర్వచనము చేయించవలెను. పురడు తర్వాత

శిశువుతో అత్తవారింటికి వెళ్ళుట: సోమ,బుధ,గురు,శనివారములు;2,3,5,7,10,13

తిధులు;అశ్విని,రోహిణి,మృగ,పున,పుష్య,మఘ,ఉత్తరాత్రయం,హస్త,చిత్త,స్వాతి,అనూ,శ్రవ,ధని,శత,రేవతీ నక్షత్రములు

మంచివి.తారాబల,ఆనందాదియోగ,వారశూలాలు చూడవలెను.తారాబలము శిశువునకు,తల్లికి కూడా

సరిపోవలెను.శిశువు జననాది 3,5,7,911 నెలలందు గాని,నెలలోపున బేసిరోజులయందు గాని వెళ్ళవచ్చును.

దత్తస్వీకారమునకు: బుధ,గురు,శుక్రవారములు;2,3,5,7,10,13 శుద్ధ ఏకాదశి ,రోహి, పున, పుష్య, ఉత్తరాత్రయం, హస్త,

స్వాతి, అనూ, శ్రవ, ధని, శత, రేవతి, నక్షత్రములు మంచివి.లగ్నమునకు శుభగ్రహదృష్టి,శుభగ్రహస్థితి మంచిది.

యజ్ఝోపవీత ధారణ: శ్రావణ పౌర్ణమి.గ్రహణ మోక్షము,మృత జాతశౌచానంతరములందు క్రొత్త జంధ్యము ధరించవలెను.
బల్లిపాటునకు ఫలము

శిరస్సు మీద బల్లి పడిన కలహము,బ్రహ్మరంధ్రమునకు వెనుకబడిన లక్ష్మీ సంప్రాప్తి.నడినెత్తి రోగము, ముఖమున బంధు

దర్శనము, మంగురుల మీద హాని, జడ మీద భర్తకు, చెంపల పైన స్త్రీలకు శుభము.చెవి మీద దుర్వార్తశ్రవణము,కుది

కన్ను మీద అపజయము,ఎడమకన్ను అవమానము, ఉక్కు మీద కార్యహాని, మీసములపై అధికార లాభము, గడ్డముపై

అపమృత్యువు, గొంతు ఎముక మీద అనేక కష్టములు, రొమ్మున జయము, గుండె మీద అధైర్యము, పై కడుపున

పుత్రలాభము, భుజములపై అన్యసహాయము, బొడ్డున భయము, అరచేతిపై ధనప్రాప్తి, మోచేతి మీద కలహము,

మణికట్టుపై గర్వభంగము, వెన్నున శత్రుభయము, నడుమున వస్త్రలాభము, తొడ మీద అన్నరోగ్యము, లింగముపైన

సంతాన ఫ్రాప్తి, మోకాలిపైన వాహన లాభము, పిక్కలయందు కార్యఫలము, పాదమున స్త్రీలాభము, కాలివ్రేళ్ళ మీద

రోగము, అరికాలిమీద ఉద్యోగప్రాప్తి కలుగును.
9 BEAUTIFUL MESSAGES...

1) stay away from anger...

It hurts...Only You!

2) If you are right then there is no need to get angry,

and if you are wrong then you don't have any right

to get angry.

3) Patience with family is love,

Patience with others is respect.

Patience with self is confidence and Patience with

GOD is faith.

4) Never think hard about the PAST, It brings tears...

Don't think more about the FUTURE, It brings fears...

Live this moment with a smile,

It brings cheers

5) Every test in our life makes us bitter or better,

Every problem comes to make us or break us,

The choice is ours whether we become victims or

victorious

6) Beautiful things are not always good but good

things are always beautiful

7) Do you know why God created gaps between

fingers?

So that someone who is special to you comes and fills

those gaps by holding your hand forever

8)Happiness keeps you sweet so try n be as happy

from within as possible

9)God has send us all in pairs...someone ¬¬...somewhere is

made for u...so wait

for the right time n right moment..
సీ. శ్రీకంఠ నీగుణ చింతనామృతముచే

మరిగి చొక్కినయట్టి మనము మనము!

సర్వజ్ఞ నీపాద జలజ సమర్చన

కలితమై తనరెడి కరము కరము!

క్రీడా కిరాత నీ కింకర పదరజ

శ్చిహ్నితంబైనట్టి శిరము శిరము!

వైకుంఠ మిత్ర నీ వరచరిత్ర స్తోత్ర

స్థిత భక్తి బరగెడి జిహ్వ జిహ్వ!

గీ. శర్వ నీ దివ్య రూపంబు సతతంబు

నమ్మి గాంచఁగ నేర్చిన నరుఁడు నరుఁడు!

భూతలోకేశ! ఆచంట పుర నివేశ!

భావ భవనాశ! రామేశ! పార్వతీశ!

Bottu pettukovadam

Bottu pettukovadam ante-punarjanmanu nammadam-ide sanatana dharmam

Ante ninnu nevu uddarichuko dhram sahayato, anduke gudi loniki/dwajastambham daggariki bottu

pettukonivarini anumatincharu.

Pilaka pettukovadam –sanatana dharmam

Vibhuthi rasukovadam –Sanatana Dharmam